హోమ్Purushotthamu.C 393 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి బట్టితి బట్టితి ||నీ చరణములే||దిక్కిక నీవే చక్కగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||న్యాయము గాని నా క్రియ లన్ని రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||భావము మార్చి నావెత దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||చంచల బుద్ధి వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||చుట్టుకొని యున్న శోధన లున్న పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||నాచు పిశాచి నరుకుట గాచి కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||యేసుని తోడ నెన్వరు సాటి దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే|| ✍ పురుషోత్తము చౌధరి Nee Charanamule Nammithi Nammithi- Nee Paadhamule Pattithi Pattithi Pattithi || Nee Charanamule || Dhikkika Neeve- Chakkaga Raave = Mikkili Mrokkudu || Nee Charanamule || Aihika Sukhamun – Arasithi Nithyamu = Ahaha Droahee Droahini Droahini || Nee Charanamule || Nayaayamu Kaani – Naa Kriayalanni – Roayuchu Throayaku Throayaku Throaku || Nee Charanamule || Bhaavau Maarchi – Naa Vetha Theerchi = Devara Proa Vave Proavave Proavave || Nee Charanamule || Chanachal Buddhi – Vanchana Yoddhi =Unchaka Thru Nchave Thrunchave Thrunchave || Nee Charanamule || Chuttukoni Yunna –Soadhanalunna – Pattu Vida Gotta Ve Kottave Kottave || Nee Charanamule || Naachu Pisaachi –Narukuta Gaachi –Kaachukoa Dhaa Chave Dhaachave Dhaachave || Nee Charanamule || Yesuni Thoadan- Evvaru Saati = Doasamu Baapunu Baapunu Baapunu || Nee Charanamule || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి