ఎంతజాలి యేసువా యింతయని

637

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత||

  1. హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత||

  2. రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై ||ఎంత||

  3. ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా ||ఎంత||

  4. నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా ||ఎంత||

  5. నేను బ్రతుకు దినములన్ని క్షేమ మెల్లవేళలందు నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభూ ||ఎంత||

  6. నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడ నీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ||ఎంత||

  7. అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా ||ఎంత||

Post a Comment

కొత్తది పాతది