ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

634

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసునాధాసారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ముసంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి సమాధానము నొసగ సరగున రావా ||ఈ||

  1. బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె బాధలన్నియు బావ బహుత్వరగ రావా ||ఈ||

  2. రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము ||ఈ||

  3. సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధానరాజ్యం స్థాపించరావా ||ఈ||

  4. మొదటి జామయ్యెను మీరింక రారయ్యె రెండవజామున జాడలేదె మూడవ జామయ్యె మీరింకా రారయ్యొ నాలుగవ జామున నడచివస్తున్నారా ||ఈ||

  5. పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లిసంఘము నాత్మయు బిలుచుండె పెండ్లివిందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయ యని ఆనందింతున్ ||ఈ||

Post a Comment

కొత్తది పాతది