ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో
Song no:315 ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న|| కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ || ఉన్న|| మసి బొగ్గువలె నా మా నస మెల్లఁ గప్పె దో ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటుఁ గడిగి పవిత్ర్ర పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని || ఉన్న|| వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె …