Yesutho tiviganu podhama యేసుతో ఠీవిగాను పోదమా

Song no: 521
    యేసుతో ఠీవిగాను పోదమా - అడ్డుగా వచ్చువైరి గెల్వను } 2
    యుద్ధ నాదంబుతో బోదము||యేసుతో||

  1. రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను } 2
    యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా } 2
    యేసుతో ఠీవిగాను వెడలను||యేసుతో||

  2. విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజు నాజ్ఞ మదిని నిల్పుచు } 2
    అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై } 2
    యెసుతో ఠీవిగాను వెడలను||యేసుతో||

  3. శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా } 2
    భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము } 2
    యేసుతో ఠీవిగాను వెడలను||యేసుతో||

  4. ఓ యువతీ యువకులారా చేరుడి - శ్రీ యేసురాజు వార్త చాటుడి } 2
    లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను } 2
    సాధనంబెవరు నీవు నేనెగా||యేసుతో||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.