అక్టోబర్ 30, 2024
4 12 యెహోవా దేవుని స్తుతి రాగం - ఆనందభైరవి (103-వ దావీదు కీర్తన) తాళం - ఆది దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగములో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకుఁ జేసిన మేళ్లన్ మరవకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ వేయును నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే …