Yehova ninnu poliyunnavarevvaru యెహోవా నిన్ను పోలియున్నవారెవ్వరు

Song no: 18
    యెహోవా నిన్ను పోలియున్నవారెవ్వరు
    యేసువా నీకు సాటియైన వారెవ్వరు "2"

  1. సృష్టికి ఆదారుడా అద్వితీయుడా
    నిత్యము నివసించుచున్న సత్యదేవుడా "2"
    అందరిలో సుందరుడా కాంక్షనీయుడా "2"
    వందనముల కర్హుడా పూజ్యనీయుడా "2" ||యెహోవా||

  2. పాపికొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా
    లోక శాపమును మోసిన సిలువ ధారుడా "2"
    మరణపు కోరలు పీకిన విజయవీరుడా "2"
    శరణ్ననచో కరుణచూపు పరందాముడా "2" ||యెహోవా||

  3. ఆదియు అంతములేని అగ్నినేత్రుడా
    ఆదరించు నాధుడా స్తుతికి పాత్రుడా "2"
    కన్యక కడుపునబుట్టిన పరమపుత్రుడా "2"
    అన్యజనుల జతకట్టిన మంచి మిత్రుడా "2" ||యెహోవా||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.