Song no:
- నాతో మాట్లాడుమయ్యా - నన్ను దర్శించుమయ్యా
- కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకూ నను చేర్చుమయ్యా
కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
- నావారే నన్ను నిందించు వేళ - నను విడిచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు - కరువైన వేళ - దరి చేరి ఒదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
- నా కాలు జారి తొట్రిల్లు వేళ - చేజార్చి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను - బంధించు వేళ - నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా
నాతో మాట్లాడుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....