Oka sari nenu venudhirigi chusa lyrics ఒక సారి నేను వెనుదిరిగీ చూశా నే నడిచిన మార్గములోన

ఒక సారి నేను వెనుదిరిగీ చూశా
నే నడిచిన మార్గములోన
అడుగుల గురుతులను
ఆ గురుతులు తెలిపే / కథలన్నీ విన్నా
నా గతమును కనులారా / ఒక మారు చూశా
ఎన్నెన్నో దీవెనలు / ఆశ్ఛర్యకార్యములు
ఎన్నో అనుభూతులు / ఆనంద స్మృతులు
నను కన్న తలిదండ్రుల / ప్రేమా అనురాగం
నాతోబుట్టువు నాలో నింపిన వాత్సల్యం
సుమధుర అనుభవం / వర్ణాలమయము
నా భాగస్వామితో పయనించే సమయము
ప్రతి ఉదయం నవ్వూ / శ్రమనున్న తృప్తీ
ఇది నా జీవితము
ఓ వరమే ఒక తరుణమే ॥ఒకసారి॥
1॰
ఇంకొంత దూరం / సాగాలీ పయనం
చేరాలి నా గమ్యం / బంగారు నగరం
ఆలోగ నాకు / మిగిలిందొక లక్ష్యం
ప్రతిజీవికి ప్రచురింప / యేసుని ఘన నామం
ద్వేషం భరియించీ / తరములకు ప్రకటించెద
యేసుని సిలువ ప్రయాసం
తన మరణ సందేశం
గాయముతో కృంగిన
ఈ లోకముకు స్వస్థతను
యేసులో నిరీక్షణను / ఆయనలో జీవమును
వందనమో దేవా / వందనము నీకే
కలువరిలో నీ యాగం / నా రక్షణ భాగ్యం
బ్రతికెద నీకొరకే / ఇరుకులు ఎదురైనా
చావైతే మేలే / నిను చేరే తరుణమే
॥ఒక సారి॥

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes