Song no: 682
- యెహోవా నా బలమా
- నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ } 2
వరదవలె భక్తిహీనులు పొర్లిన } 2
విడువక నను ఎడబాయని దేవా } 2 || యెహోవా ||
- మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై. } 2
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను } 2
ఆదరెను ధరణి భయకంపముచే } 2 || యెహోవా ||
- నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును } 2
జలరాసులనుండి బలమైన చేతితో } 2
వెలుపల చేర్చిన బలమైన దేవుడు } 2 || యెహోవా ||
- పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను } 2
తన నోటనుండి వచ్చిన అగ్ని } 2
దహించివేసెను వైరులనెల్లన్ } 2 || యెహోవా ||
- మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును } 2
ఉరుముల మెరుపుల మెండుగ జేసి } 2
అపజయమిచ్చును అపవాదికిని } 2 || యెహోవా ||
- దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును } 2
గర్విష్టుల యొక్క గర్వమునణుచును } 2
సర్వమునెరిగిన సర్వాధికారి } 2 || యెహోవా ||
- నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి } 2
రక్షణ కేడెము నాకందించి. } 2
అక్షయముగ తన పక్షము జేర్చిన } 2 || యెహోవా ||
- యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే } 2
అన్యజనులలో ధన్యత చూపుచు } 2
హల్లెలూయ స్తుతిగానము చేసెద } 2 || యెహోవా ||
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం } 2 || యెహోవా ||