ఎవని అతిక్రమములు

636

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండుయెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని||

  1. మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని||

  2. దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని||

  3. నేను నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని||

  4. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని||

  5. కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని||

  6. విస్తార జలప్రవాహము పొర్లినను నిశ్చయముగ అవి వారి మీదికి రావు ||ఎవని||

  7. నాకు దాగుచోటు నీవే శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా ||ఎవని||

  8. విమోచన గానములతో నీవు నన్ను ఆదరించి నాకుపదేశము చేసెదవు ||ఎవని||

Post a Comment

కొత్తది పాతది