639
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ||హల్లె||
- నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||హల్లె||
- నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీసంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే ||హల్లె||
- నా మనువులు ముందే నీ మనస్సులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంధంబులో నుండె ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ||హల్లె||
- నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||హల్లె||
కామెంట్‌ను పోస్ట్ చేయండి