అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును

Adhigadhigo Alladhigo
Kalvari Mettaku Dhaaradhigo
Aa Prabhuvunu Vesina Siluvadhigo || Adhigadhigo ||

  • Gethsemanu Oka Thotadhigo
    Aa Thotalo Praardhana Sthalamadhigo } 2
    Achatne Yundi Praardhinchudani } 2
    Palikina Kreesthu Maatadhigo } 2 || Adhigadhigo ||

  • Shishyulalo Iskariyothu
    Yoodhaayanu Oka Ghaathakudu } 2
    Prabhuvunu Yoodhulakappagimpa } 2
    Pettina Donga Muddhadhigo } 2 || Adhigadhigo ||

  • Lekhanamu Neraverutakai
    Ee Lokapu Paapamu Povutakai } 2
    Paavanudesuni Rakthamunu Gala } 2
    Muppadhi Rooka Mootadhigo } 2 || Adhigadhigo ||

  • Chali Kaachukonu Gumpadhigo
    Aa Pethuru Bonkina Sthalamadhigo } 2
    Moodavasaari Bonkina Ventane } 2
    Kokkorokoyanu Koothadhigo } 2 || Adhigadhigo ||

  • Yoodhula Raajuvu Neevenaa
    Modhamutho Neevannatle } 2
    Neelo Dhoshamu Kanugonaleka } 2
    Chethulu Kadigina Pilaathudadugo } 2 || Adhigadhigo ||

  • Golgothaa Sthala Addharini
    Aa Iddaru Dongala Madhyamuna } 2
    Saakshaatthu Yehovaa Thanayuni } 2
    Siluvanu Vesiri Choodadhigo } 2 || Adhigadhigo ||

  • Golluna Yedchina Thalladhigo
    Aa Thalliki Cheppina Maatadhigo } 2
    Yoodhula Raajaa Digi Rammanuchu } 2
    Helana Chesina Mookadhigo } 2 || Adhigadhigo ||

  • Daahamu Gonuchunnaananuchu
    Praanamu Vidichenu Paavanudu } 2
    Parishuddhudu Mana Rakshakudesu } 2
    Mana Madhi Yemo Gamaninchu } 2 || Adhigadhigo ||
  • అదిగదిగో అల్లదిగో
    కల్వరి మెట్టకు దారదిగో
    ఆ ప్రభువును వేసిన సిలువదిగో    || అదిగదిగో ||

  • గెత్సేమను ఒక తోటదిగో
    ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో } 2
    అచటనే యుండి ప్రార్ధించుడని } 2
    పలికిన క్రీస్తు మాటదిగో } 2      || అదిగదిగో ||

  • శిష్యులలో ఇస్కరియోతు
    యూదాయను ఒక ఘాతకుడు } 2
    ప్రభువును యూదులకప్పగింప } 2
    పెట్టిన దొంగ ముద్దదిగో } 2      || అదిగదిగో ||

  • లేఖనము నెరవేరుటకై
    ఈ లోకపు పాపము పోవుటకై } 2
    పావనుడేసుని రక్తమును గల } 2
    ముప్పది రూకల మూటదిగో } 2      || అదిగదిగో ||

  • చలి కాచుకొను గుంపదిగో
    ఆ పేతురు బొంకిన స్థలమదిగో } 2
    మూడవసారి బొంకిన వెంటనే } 2
    కొక్కొరొకోయను కూతదిగో } 2    || అదిగదిగో ||

  • యూదుల రాజువు నీవేనా
    మోదముతో నీవన్నట్లే } 2
    నీలో దోషము కనుగొనలేక } 2
    చేతులు కడిగిన పిలాతుడాడుగో } 2      || అదిగదిగో ||

  • గొల్గొతా స్థల అద్దరిని
    ఆ ఇద్దరు దొంగల మధ్యమున } 2
    సాక్షాత్తు యెహోవా తనయుని } 2
    సిలువను వేసిరి చూడదిగో } 2      || అదిగదిగో ||

  • గొల్లున ఏడ్చిన తల్లదిగో
    ఆ తల్లికి చెప్పిన మాటదిగో } 2
    యూదుల రాజా దిగి రమ్మనుచు } 2
    హేళన చేసిన మూకదిగో } 2      || అదిగదిగో ||

  • దాహము గొనుచున్నాననుచు
    ప్రాణము విడిచెను పావనుడు } 2
    పరిశుద్ధుడు మన రక్షకుడేసు } 2
    మన మది యేమో గమనించు } 2    || అదిగదిగో ||