Song no: 323
రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవఁ జేయ మమ్ముఁ జేపట్టుటకు ||రావయ్య||
హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు లన్నియు ఖండించుటకు ||రావయ్య||
మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగాఁ జేసి దారిఁ జూపుటకు ||రావయ్య||
పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియుఁ పారఁ దోలుటకు ||రావయ్య||
అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య||