ఎంతో రమ్యంబైనది భూతలమందు

520

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎంతో రమ్యంబైనది భూతలమందు ఎంతో మాన్యంబైనది చెంత జేరి యేసు వింత పాదాబ్జముల సంతసంబున పూజసల్పు క్రైస్తవ గృహము ||ఎంతో||

  1. పిల్ల లొలీవ మొక్కలై బల్లల చుట్టు ఎల్లప్పుడు ఆడుచున్ నుల్లమందున యేసు చల్లని వాక్యంబున్ నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము ||ఎంతో||

  2. తల్లిదండ్రు లైక్యత దనరుచునుండి దాక్షిణ్య నిధుల జిల్కి ఎల్లప్రేమామృత మెల్ల వారల కొసగి కల్లోలములు వీడి నుల్లసిల్లెడి గృహము ||ఎంతో||

  3. పొరుగువారల మైత్రిని పొందుగ గోరి పొలుపారు నీతిన్ దనరు నురుతరనాత్మ వరముల పైని గురిపించు వరదాత యేసున్ ప్రార్థించు క్రైస్తవ గృహము ||ఎంతో||

  4. శోధనల నన్నింటిని సర్వదా పైచి శోభిల్లు విశ్వాసమున్ మోద మొందగ యేసునాధు నందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము ||ఎంతో||

  5. వ్యర్థ ఖర్చుల మానుచు వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ వృద్ధి నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా ఇద్ధరిత్రిని దశమభాగ మొసగెడు గృహము ||ఎంతో||

Post a Comment

కొత్తది పాతది