521
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవచేయను యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
- విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
- శోధనలు మనల చుట్టివచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
- ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
కామెంట్‌ను పోస్ట్ చేయండి