ఎంతదూరము మోయించెదరు
637 ఎంతదూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి నుంతైన దయలేక ||ఎంత|| ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత|| సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంత|| కరములు జోడించి కడకు గేత్సెమనిలో పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||ఎంత|| పిరికి పిలాతుని బెదరించి యదలించి యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంత|| ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు …
Social Plugin