బలియైతివా నన్ను బ్రతికించినావా

    బలియైతివా నన్ను బ్రతికించినావా
    వెలియైతివా నన్ను వెలిగించినావా - 2
    ఆ ఆహా హ ఆ ఆ ఆ ఆ - 2

    నా కాళ్లతో నే చేసిన పాపం
    నీ కాళ్ళకే మేకులాయే - 2
    నీ కాళ్ళకే మేకులాయే నా ప్రభువా|| బలియైతివా ||

  1. నా చేతులతో నే చేసిన దోషం
    నీ చేతులకు సీలలాయే -2
    నీ చేతులకు సీలలాయే నా ప్రభువా || బలియైతివా ||

  2. నిలువెల్లా నేను చెడిపోగా దేవా
    వదలేల నలిగెను నీదు -2
    వదలేల నలిగెను నీదు నా ప్రభువా || బలియైతివా ||

Post a Comment

కొత్తది పాతది