Song no: 191
ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత పంతము తోఁ జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత ||ఎంతో||
పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది పలుకఁ డాయె యేసు స్వామి నాఁడు ||ఎంతో||
మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడ మూర్ఛఁబోయె నేసు తండ్రి ||యెంతో||
కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలోఁ జీలల్ కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగఁ క్రీస్తేసున్ బట్టి ||యెంతో||
దాహముగొనఁ జేదు చిరకఁ ద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రిఁ ప్రజల బాధ కోర్చి ధన్యుఁడా దివి కేగె నహహా ||యెంతో||
బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహా ఏరై పారె యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసఁగు ||నెంతో||

కామెంట్‌ను పోస్ట్ చేయండి