ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ
191 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడ మూర్ఛబోయె నేసు తండ్రి ||యెంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలో జీలల్ కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ||యెంతో|| దాహముగొన జేదు చిరక ద్రావ …