ఫిబ్రవరి 25, 2023
inMungamuri Devadasu ✍
నాకేమి కొదువ నాధుడుండ ఇక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్టపాలకుడు నాయేక రక్షకుడు
14 59 యెహోవా నా కాపరి రాగం - సావేరి (23-వ దావీదు కీర్తన) తాళం - త్రిపుట నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక || నాకేమి || తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక || నాకేమి || ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుడు శాంత జలములు నా చెంతనే యుండు గనుక || నాకేమి || తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు నలసటను నా తప్పు మన్నించున్ కనుక…