Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Naakemi koddhuva 📀
నాకేమి కొదువ నాధుడుండ ఇక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్టపాలకుడు నాయేక రక్షకుడు
నాకేమి కొదువ నాధుడుండ ఇక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్టపాలకుడు నాయేక రక్షకుడు
Online Lyrics List
ఫిబ్రవరి 25, 2023
14 59
యెహోవా నా కాపరి
రాగం - సావేరి
(23-వ దావీదు కీర్తన)
తాళం - త్రిపుట
నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక
|| నాకేమి ||
తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక
|| నాకేమి ||
ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుడు శాంత జలములు నా చెంతనే యుండు గనుక
|| నాకేమి ||
తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు నలసటను నా తప్పు మన్నించున్ కనుక
|| నాకేమి ||
నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకుఁ దనను నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక
|| నాకేమి ||
చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి పోవలసినను నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక
|| నాకేమి ||
మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక
|| నాకేమి ||
పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుఁగని సౌఖ్యభో జన మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక
|| నాకేమి ||
తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక
|| నాకేమి ||
పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక
|| నాకేమి ||
బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక
|| నాకేమి ||
దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాఁదిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక
|| నాకేమి ||
|| నాకేమి ||
రెండవ భాగము
కావలసినవెల్ల - కనబడ గలవు - మనకు = ఏవియడిగిన - వాని నిచ్చి వేయును తండ్రి - ఇచ్చి
|| నాకేమి ||
ధనసహాయంబు - మనకుగలుగు నేడు అనుదినంబు - తండ్రి మనకు అక్కరలు తీర్చు - మన
|| నాకేమి ||
బస యేర్పాటులు మా - ప్రభువే చేయున్ - నా = బస దిగిన స్థలమందు మా - ప్రభువె నివసించున్ - మా
|| నాకేమి ||
ప్రభువు దూతలును - పరిశుద్ధులున్ - ఇక = విభవముగ మన మధ్య - మసలుచు వెల్గుచుందురుగా - హా
|| నాకేమి ||
జనకునియిష్ట - జనము వచ్చు ఇక తనకు యిష్టముగాని జనమును దరికి రానీయడు - ఈ
|| నాకేమి ||
మామిత్రులైన - మహిమ దూతలే - ఇక = క్షేమమునకై మాచుట్టు - చేరికాయుదురు - చుట్టు
|| నాకేమి ||
అందరుమేళ్ళు - అనుభవింప - ఇపుడు = విందుగా సమకూడు వార్తలు వినిపించును - తండ్రి
|| నాకేమి ||
ప్రభుని శరీర - రక్తములు - నా = ఉభయ జీవితములకు - మేలై ఉండును - నాకు
|| నాకేమి ||
నైజపాపములు - నశియించుటకే - మన = భోజనము వడ్డించును - రాజేస్వయముగా - దేవ
|| నాకేమి ||
నీ మనసులోనివి - నెరవేరును - ఇక = క్షేమముగనే ఉండవలయు - చింతలేకుండ - నీవు - చింతలేకుండ - గనుక
|| నాకేమి ||
నాకు నాతండ్రి - నరరూపముతో - ఇక = త్రైకునిరీతిగ కనబడి ధైర్య మిచ్చును - నాకు - ధైర్యమిచ్చును - గనుక
|| నాకేమి ||
జనక సుతాత్మ - లను దేవుడు - ఇక = ఘనముగా యుగములనన్నిట వినుతులొందును - నేనా - యన గొర్రెనే గనుక
|| నాకేమి ||
naakaemi koduva - naadhuDuMDa ika = SreekaruMDagu daevuDae naa SraeshTapaalakuDu - naayaeka rakshakuDu ganuka
|| naakaemi ||
ennaTikaina eMDanaTTi - ika = sanna pachchikavaMTi tarugani - sadupaayaM bul^ - naakennO chaeyun^ ganuka
|| naakaemi ||
tanivi teeran^ maeLLanubhaviMpa - naenu = nanu sadaa maeLLaneDi pachchika nadimi mRdhuvuga - paMDu - konajaeyunu ganuka
|| naakaemi ||
eMta SOdhana - yeMDayunna - naaku = eMtaku nnOrigara depuDu SaaMtajalamulu - naacheMtanae yuMDun^ ganuka
|| naakaemi ||
tappipOyina nan^ - daariMbeTTi - ika = tepparillachaesi naaku - teerchu nalasaTanu - naatappu manniMchun^ ganuka
|| naakaemi ||
neeti maargamun^ nilpunu nannu - ika = neetilaeninaaku tana su -neeti dayachaeyun^ sva-neetinin^ druMchun^
|| naakaemi ||
chaavucheekaTla - SaktiyuMDu -ika = lOyalObaDi pOvalasinananu - nae veravakuMDa - naa daevuDae tODu ganuka
|| naakaemi ||
kashTaMbulanu chee-kaTi lOyalO - ika = spashTamuga ghanasaukhyamunu naadRshTikiMjoopi - naa - nashTamul^ deerchun^ ganuka
|| naakaemi ||
meedapaDunaTTi - SOdhanalan^ - naa - naadariki raaneeka daMDamu - nannu laaguchunu - naa - kaadharaNayaunu ganuka
|| naakaemi ||
pagavaaral^ siggu-paDunaTlugaa - ika = jagati yerugani - saukhyabhOjana maguparachuchun^ - haa - taginadae peTTun^ ganuka
|| naakaemi ||
tanayaatmanaMda - tailaMbutO - nannu = anudinamu talayaMTi visuga-konaka tuDuchunu - naa - kanuneeLLanni ganuka
|| naakaemi ||
paluvidhamulaina - bhaagyamulatO - naaku = velupaliki diga - veDalu naTTi velagalaginne - naa kalimigaa jaeyun^ ganuka
|| naakaemi ||
bratukaMtaTan^ kR-paakshaemamulu - naa = vadalakuMDagavachchu naatO - sudinamulugalgu - naa - padalu saMpadalau ganuka
|| naakaemi ||
duritaMbuluMDu - dharaNi naaku - ika = iravukaadika - neppaTikinaa parama daevuni - maMdirame naayillu ganuka
|| naakaemi ||
reMDava bhaagamu
kaavalasinavella - kanabaDa galavu - manaku = aeviyaDigina - vaani nichchi vaeyunu taMDri - ichchi
|| naakaemi ||
dhanasahaayaMbu - manakugalugu naeDu anudinaMbu - taMDri manaku akkaralu teerchu - mana
|| naakaemi ||
basa yaerpaaTulu maa - prabhuvae chaeyun^ - naa = basa digina sthalamaMdu maa - prabhuve nivasiMchun^ - maa
|| naakaemi ||
prabhuvu dootalunu - pariSuddhulun^ - ika = vibhavamuga mana madhya - masaluchu velguchuMdurugaa - haa
|| naakaemi ||
janakuniyishTa - janamu vachchu ika tanaku yishTamugaani janamunu dariki raaneeyaDu - ee
|| naakaemi ||
maamitrulaina - mahima dootalae - ika = kshaemamunakai maachuTTu - chaerikaayuduru - chuTTu
|| naakaemi ||
aMdarumaeLLu - anubhaviMpa - ipuDu = viMdugaa samakooDu vaartalu vinipiMchunu - taMDri
|| naakaemi ||
prabhuni Sareera - raktamulu - naa = ubhaya jeevitamulaku - maelai uMDunu - naaku
|| naakaemi ||
naijapaapamulu - naSiyiMchuTakae - mana = bhOjanamu vaDDiMchunu - raajaesvayamugaa - daeva
|| naakaemi ||
nee manasulOnivi - neravaerunu - ika = kshaemamuganae uMDavalayu - chiMtalaekuMDa - neevu - chiMtalaekuMDa - ganuka
|| naakaemi ||
naaku naataMDri - nararoopamutO - ika = traikunireetiga kanabaDi dhairya michchunu - naaku - dhairyamichchunu - ganuka
|| naakaemi ||
janaka sutaatma - lanu daevuDu - ika = ghanamugaa yugamulananniTa vinutuloMdunu - naenaa - yana gorrenae ganuka
|| naakaemi ||
<
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form