సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో
Song no: 575 సంతోషముతో నిచ్చెడు వారిని – నెంతో దేవుడు ప్రేమించున్ – వింతగ వలసిన దంతయు నొసగును – వినయ మనసుగల విశ్వాసులకును ||సంతో|| 1. అత్యాసక్తితో నధిక ప్రేమతో – నంధకార జనులందఱకు – సత్యసువార్తను జూటించుటకై – సతతము దిరిగెడు – సద్భుక్తులకు ||సంతో|| 2. వేదవాక్యమును వేరువేరు గ్రా-మాదుల నుండెడు బాలురకు – సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి – సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు || సంతో|| 3. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల – తక్కువలన్నిటి దీర్చుటకై – నిక్కపు రక్షణ నిద్దరలో నలు – ప్రక్కలలో బ్రక – టించుట కొరకై 4. ఇయ్యండి మీకియం బడునని – యియ్యంగల ప్రభుయే సనెన…