Santhoshamutho necchedu varini nentho సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో

Song no: 575

సంతోషముతో నిచ్చెడు వారిని – నెంతో దేవుడు
ప్రేమించున్ – వింతగ వలసిన
దంతయు నొసగును – వినయ మనసుగల విశ్వాసులకును
||సంతో||
1. అత్యాసక్తితో నధిక ప్రేమతో – నంధకార జనులందఱకు –
సత్యసువార్తను
జూటించుటకై – సతతము దిరిగెడు – సద్భుక్తులకు
||సంతో||
2. వేదవాక్యమును వేరువేరు గ్రా-మాదుల నుండెడు
బాలురకు – సాధులు ప్రభుని
సుబోధలు నేర్పెడి – సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||
సంతో||
3. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల – తక్కువలన్నిటి దీర్చుటకై –
నిక్కపు రక్షణ నిద్దరలో
నలు – ప్రక్కలలో బ్రక – టించుట కొరకై
4. ఇయ్యండి మీకియం బడునని – యియ్యంగల ప్రభుయే
సనెను – ఇయ్యది
మరువక – మదిని నుంచుకొని – యియ్యవలెను మన
యీవుల నికను ||సంతో||
5. భక్తిగలిగి ప్రభు పనికిచ్చుట బహు-యుక్తమటంచును-
దారతతో-శక్తికొలది
మన భక్తి నుండి యా-సక్తితో నిరతము – నియ వలెను ||సంతో||
Copyright © Lyrics List. Designed by OddThemes