ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు
Song no: #86 ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు నీకు ||నేమి|| నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము ||నేమి|| అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి|| నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి నాలించు ||మేమి|| నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచ…