విజయ గీతముల్ పాడరే క్రీస్తునకు
Song no: #77 విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్ హృదయములతో భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| మంగళముగ యేసుఁడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరఁగఁదన రక్తబలము వలనఁ పొంగు నణఁగఁజేసెను సాతానుని బల్ క్రుంగ నలిపి చీల్చెను ||విజయ|| పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరియించెను పాప మెరుఁగని యేసు పాపమై మనకొరకు పాపయాగము దీర్చెను దేవుని నీతిన్ ధీరుఁడై నెరవేర్చెను ||విజయ|| …