జూన్ 07, 2018
inShalom Jagan
వీరుల మయ్యా జయ వీరుల మయ్యా
Song no: 359 వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల|| మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై బడిన ధ్వజము విడమాయా ||వీరుల|| పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల|| అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ కొకింత సిగ్గు పడ మయా ||వీరుల|| భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ మైనఁ బెట్టువారము ||వీరుల||