శ్రీ యేసునే భజించు నా మనసా
Song no: #79 శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు|| యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు ||శ్రీ యేసు|| నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసు|| స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన ||శ్రీ యేసు|| నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు ||శ్రీ యేసు|| మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన ||శ్రీ యేసు||