అరెరరె నేడో రేపో వస్తాడేసయ్యా

|| ||

అరెరరె నేడో రేపో వస్తాడేసయ్యా రాజులకు రాజై అందరినేల వస్తాడు ప్రభువులకు ప్రభువై మేఘాల మీద వస్తాడు శిక్ష కావాలా నీకు రక్షణ కావాలా? ||అరెరరె|| 1. అక్రమం అన్యాయం - అంతులేక పెరుగుతాయి బుద్ధిలేని బూటకాలు - హద్దు మీరిపోతాయి దయ్యాలు చెలరేగి - కయ్యములు రేపుతాయి ఈలోక నాటకాలు - నాశనం అవుతాయి ||శిక్ష|| 2. కరువు కాటకాలింక - చెలరేగి వస్తాయి నెరవేసి భూమి కూడ బద్దలై పోతాది సాగరము ఘోషపెట్టి - ఉప్పెనై పోతాది సూర్య చంద్ర చుక్కలన్ని - సూచనలు చూపుతాయి ||శిక్ష|| 3. పంచభూతాలన్ని - అంచనాల కందవింక మిక్కుటపు వేండ్రముతో - లయమై పోతాయి భూలోక జనులంతా - గుండెలవిసి కూలెదరు కొండబండ సందులలో - మాటులలో దాగెదరు ||శిక్ష||