Song no:
- గుండె బరువెక్కిపోతున్నది
-
ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2)
నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2)
యేసయ్యా.. ఆధారం నీవే కదా
యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె||
- అంధకారంలో నా దీపము ఆరిపోయెనే
అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2)
దినదినము నేను కృంగుచున్నాను (2)
యేసయ్యా.. వెలిగించగ రావా
యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె||
- ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే
ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2)
ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2)
యేసయ్యా.. దర్శించ రావా
యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె||
ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2)
నా మనసేమో కలవరపడుచున్నది (2)
యేసయ్యా.. ఆదరించ రావా
యేసయ్యా.. బలపరచ రావా ||గుండె||