తలదాచుకొనుటకు నీడ - ఇలలేని గలలియవాడ
కలకాలమిక నీ కోట - సిలువేన నా చెలికాడ } 2
-
పరలోక సుఖమును వీడి - నరలోక కరవులమాడి } 2
నిరుపేదగను జీవించి - శరణంబు నొసగితివయ్య } 2
ప్రతిపూట తినుటకు లేక - గతిలేని తెరువరి వోలె } 2
వెతలొందుచునె నడియాడి - హతమార్చితివా నా లేమి } 2 || తల ||
-
దినమంత తీరికలేని - పనిలోక ప్రజలను గాచి } 2
కనుమూయ కొండలకేగి - కనుగొంటివా నీ పాన్పు } 2
కరకైన బాటలపైన - చురుకైన అడుగులు వేసి } 2
తిరుగాడి గూర్చితి నాకై - విశ్రాంతి గల నీ మార్గం } 2 || తల ||
-
నిర్వాసిగనె జీవించి - పరలోక జనకుని ఇంట } 2
చిరవాసము మాకీయ - నిర్మింప చనితివ దేవ || తల ||
కలకాలమిక నీ కోట - సిలువేన నా చెలికాడ } 2
నిరుపేదగను జీవించి - శరణంబు నొసగితివయ్య } 2
ప్రతిపూట తినుటకు లేక - గతిలేని తెరువరి వోలె } 2
వెతలొందుచునె నడియాడి - హతమార్చితివా నా లేమి } 2 || తల ||
కనుమూయ కొండలకేగి - కనుగొంటివా నీ పాన్పు } 2
కరకైన బాటలపైన - చురుకైన అడుగులు వేసి } 2
తిరుగాడి గూర్చితి నాకై - విశ్రాంతి గల నీ మార్గం } 2 || తల ||
చిరవాసము మాకీయ - నిర్మింప చనితివ దేవ || తల ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి