చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో
చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడ వచ్చే పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య పుట్టాడురో మనకోసం పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు } 2 సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో } 2 || చలి రాతిరి || చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు } 2 సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు } 2 || చలి రాతిరి ||