యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే
173 యేసుని ప్రేమ స్మరణ రాగం - శంకరాభరణము తాళం - ఆది యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా|| పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని|| కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని|| మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా ||యేసున…