ఫిబ్రవరి 01, 2017
inThrahimam
అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా
Song no: 332 అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు ||అప|| సిలువకు నిను నే గొట్టితిని తులవలతో జేరితిని కలుషంబులను మోపితిని దోషుండనేను ప్రభువా ||అప|| ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో ||అప|| ముళ్లతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ ||అప|| దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితినీ దేహంబుగాయంబులను ||అప|| ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా ||అప|| చిందితి రక్తము నాకై పొ…