వీరుడమ్మ వీరుడమ్మ వీరుడమ్మ

    వీరుడమ్మ వీరుడమ్మ వీరుడమ్మ
    భలే యేసు నాధుడు
    శూరుడమ్మ శూరుడమ్మ శూరుడమ్మ
    భలే యేసు నాధుడు } 2

  1. మరణాన్నే గెలిచినాడు
    మనలను బ్రతికించినాడు
    పాపమనే‌ ఊబినుండి పైకి లేవనెత్తినాడు


    చెప్పరో యేసయ్యకు వందనాలు
    కొట్టరో‌ యేసయ్యకు జేజేలు }2

  2. కుళ్ళిపోయిన శవమును
    మళ్ళి తిరిగి లేపినాడు
    కళ్ళముందు నడువంగ
    కన్నుల‌ చూపించినాడు
    ఎండిపోయిన బ్రతుకుల
    వెలుగురేఖ నింపినాడు
    చిన్నబోయిన బ్రతుకుల
    చింతలన్ని తీర్చినాడు

    తల్లడిల్లె జనమునంత తట్టినాడయో
    వాళ్ళ తప్పులు మన్నించి నిలిచి పిలిచినాడయో }2

    యేసే నిజ దైవమని
    ఎల్లరికి తెలిపినాడు || చెప్పరో ||

  3. మాటరాని మూగవారు
    మాటలాడుచున్నారు
    యేసు పేరు చెప్పి నోట
    పాట పాడుచున్నారు
    కుంటివారు గంతులేసి
    నడవసాగుచున్నరు
    చంటివారు చనిపోయిన
    ఉలికిపడి లేచినారు

    పాపులనే పిలిచినాడయో యేసయ్య
    పాపము క్షమియించినాడయో }2

    పాపమింక‌ చెయ్యొద్దని
    యేసుడన్న నీతి మాట || చెప్పరో ||

Post a Comment

కొత్తది పాతది