చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు

    చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు
    పాపి నాకై వి జ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది
    పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది

  1. దేహమంతయు నలగి శోకము చెందినవాడై
    దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే||

  2. తండ్రి ఈ పాత్ర తొలగున్ నీ చిత్తమైన యెడల
    ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను||

  3. రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది
    రక్షకుడేసు హృదయము పగులుగ విజ్ఞాపనము చేసెనే||

  4. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే
    మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే||

  5. ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు
    వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెను||

  6. నన్ను తనవలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి
    తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను ||చూడు||

కొత్తది పాతది