ఏప్రిల్ 28, 2025
330 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలె బాప ముండజూచి యేసు నండజేరి మన గుండె పదిలము జేసి ||ఖండింప|| అంధత్వమునను రక్షణమార్గ మందు జేరకయు ఎందెందు జూ చిన సందులేక పాప మందు మునిగి నరలా నందమోందక చెడిరి ||ఖండింప|| ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందు జేరుట కొఱకు ||ఖండింప|| బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు చదరున జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిక ||ఖండింప|| ఆసింపబోకు లోకభోగములు మోసమై …