ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ
23 రాగం - (చాయ: ) తాళం - ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల|| పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ||యెటుల|| భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||యెటుల|| నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు…