హోమ్Andhra Kraisthava Keerthanalu 📖 Yetula neeku stuthu lonarthumu yehova thanaya ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ byOnline Lyrics List —జనవరి 13, 2019 0 23 రాగం - (చాయ: ) తాళం - ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల||పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ||యెటుల||భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||యెటుల||నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్ నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింపఁజేసితి ||యెటుల||నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ ||యెటుల||పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ ||యెటుల|| update || Update ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి