అక్టోబర్ 07, 2018
inG John Thathayya
రండి మానవులారా రక్షకునిన మ్మండి
Song no:305 రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము ప్రియులారా రండి పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను ||రండి|| ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ||రండి|| పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును ||రండి|| పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు…