హోమ్(ఎ ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి 186 సిలువపై క్రీస్తుని ప్రేమ రాగం - నాధనామక్రియ తాళం - ఆట (చాయ : కొనియాడ దరమె నిన్ను ) ఏ పాప మెఱుగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప||ముళ్లతో గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప||కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేఱొకని దోడుగా నిచ్చినారా ||యే పాప||చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||యే పాప||ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా ||యే పాప||పలువిధంబుల శ్రమలు చెలరేగ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా సిలువపై బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా ||యే పాప||బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లి బడ బొడిచి నాడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారెగద కోపము ||యే పాప||కటకటా పాప సం కటము బాపుట కింత పటుబాధ నొంది నావా ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి ||యే పాప|| Ye Paapamerugani Yo Paavana Moorthy Paapa Vimochakundaa Naa Paali Daivamaa Naa Paapamula Kora Kee Paatlu Nondinaavaa Mullatho Kireeta – malli Nee Shiramupai – Jallaatamuna Moththiraa Mulla Potlaku Shiramu – Thalladillaga Somma – sillipothiva Rakshakaa || Ye paapa || Kaluvari Giri Danuka – Siluva Moyaleka – Kalavaramu Nondinaavaa Siluva Neetho Moya – Thuluvalu Verokani – Thodugaa Nichchinaaraa || Ye paapa || Chedugu Yoodulu Bettu – Padaraani Paatlaku – Sudivadi Nadachinaavaa Kadaku Kalvari Giri – Kada Kegi Silvanu – Grakkuna Dinchinaavaa || Ye paapa || Aa Kaala Karmulu – Bheekarambuga Ninnu – Aa Koyyapai Nunchiraa Nee Kaalu Sethulu – Aa Koyyake Soodi – Mekulatho Gruchchinaaraa || Ye paapa || Paluvidhambula Shramalu – Chelarega Dandriki – Nelugeththi Moralidithivaa Siluvapai Palumaaru – Kaluguchundedi Baadha – Valana Daahamu Naayenaa || Ye paapa || Ballidundagu Bantu – Ballemuna Nee Prakka – Jilli Bada Bodachinaadaa Ullolamulavale Nalla Neerubukanga Jallaare Gada Kopamu || Ye paapa || Kata Kataa Paapa San – katamu Baaputa Kintha – Patu Baadha Nondinaavaa Etuvantidee Prema – Yetuvantidee Shaantha – Metula Varninthu Swaami || Ye paapa || ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి