ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ } 2 || ఆశ్చర్యమైన || పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ } 2 నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే } 2 || ఆశ్చర్యమైన || పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ } 2 నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే } 2 || ఆశ్చర్యమైన || శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ } 2 విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు } 2 || ఆశ్చర్యమైన || నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూప…