జూన్ 13, 2018
Song no: 459 ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు|| నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవఁజేయ ||నెవరు|| లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ ||నెవరు|| మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము ||ఎవరు||