యేసునాధుని యోధులందరు
Song no: 117 రా – రేగుప్తి తా – ఏక యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు – వేగమె — వాసిగ నిటరండు = భాసురముగ ప్రభు జన్మము బాడుచు – నాసతోడ రండు – వేగమె — యాసతోడ రండు ||జే జయం|| దూతలమాదిరి గాత్రము లెత్తుచు – గీతము బాడుండి – వేగమె – గీతము బాడుండి = దాతయౌ మన క్రీస్తుని నీతిని – ఖ్యాతిగ బలుకుండి – వేగమె ఖ్యాతిగ బలుకుండి ||జే జయం|| గొల్లలు ప్రభు కడకేగిన రీతిని – నెల్లరు నడువుండి – వేగమె – యెల్లరు నడువుండి = ఉల్లములందున సంతసించి ప్రభు – నెల్లెడ దెలుపుండి – వేగమె – యెల్లడ దెలుపుండి ||జే జయం|| జ్ఞానుల భంగిని మానవులందరు – కానుక లియ్యుండి – వేగమె – కానుక…