మే 18, 2025
inJohn mesan neel
అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా
Song no: 410 అలసటపడ్డ నీవు దేవోక్తి విను రా, నా యొద్ద, సు విశ్రాంతి పొందుము నేను చూచు గుర్తు లేవి, వాని కుండునా? 'ప్రక్కఁ గాలుసేతులందు గాయముల్' రాజుఁబోలి కిరీటంబు వాని కుండునా 'యుండుగాని ముండ్లచేత నల్లరి' నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁ జేర్చుకొనునా? 'ఔను లోకాంతంబు దాఁక చేర్చును' వాని వెంబడింతు నేని యేమి లాభము? 'పాప దుఃఖ కష్టములు వచ్చును' చావుమట్టు కోర్తునేని ఏమి యిచ్చును? 'సంతోషంబు సౌఖ్య మింక మోక్షము'