మౌనియాయె యేసురాజు – మనకొరకై ఆ రోజు } 2
మలినమెరుగని మహరాజు – శిలగ నిలిచె ఆ రోజు } 2 || మౌనియాయె ||
- స్వస్థత నొసగిన కరముల మేకులు నాటిన రోజు } 2
ప్రేమ నిండిన యేసు హృదిలో బళ్ళెము గ్రుచ్చిన రోజు } 2 || మౌనియాయె ||
- చావునే గద్దించిన స్వరము దీనముగా మారిన రోజు } 2
జీవజలపు దాత క్రీస్తు దాహమని అడిగిన రోజు } 2 || మౌనియాయె ||
- సుందార రూపుని దేహము అందము కోల్పోయిన రోజు } 2
రోషము గల దైవసుతుడు దూషణ పాలైన రోజు } 2 || మౌనియాయె ||
మలినమెరుగని మహరాజు – శిలగ నిలిచె ఆ రోజు } 2 || మౌనియాయె ||
ప్రేమ నిండిన యేసు హృదిలో బళ్ళెము గ్రుచ్చిన రోజు } 2 || మౌనియాయె ||
జీవజలపు దాత క్రీస్తు దాహమని అడిగిన రోజు } 2 || మౌనియాయె ||
రోషము గల దైవసుతుడు దూషణ పాలైన రోజు } 2 || మౌనియాయె ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి