అక్టోబర్ 29, 2024
inC. Ramana
మంగళంబని పాడరే క్రీస్తుకు
75 క్రీస్తుకు మంగళ స్తోత్రము రాగం - మారువ (చాయ : మంగళమే యేసునకు) తాళం - ఆట మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళ|| ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి ||మంగళ|| సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వార…