చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా ఆడెదము కొనియాడెదము – అరే పూజించు ఘనపరచెదం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో గొర్రెల విడచి మందల మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా గానములతో గంతులు వేస్తూ గగనాన్నంటేలా ఘనపరచెదం (2) చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించె పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడ…