హోమ్Good Friday 📚 179 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట నా యన్న రాగదే ఓ యేసు తండ్రి నా యన్న రాగదే నా ప్రాణ ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న రాగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాటి నీ యంఘ్రియుగమునిపుడు నా యాసదీరజూతు ||నా యన్న||ఒక తోట లోపట నాడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై యున్నట్లుగా నిట్టూర్పులతో దలంతు నకట నా రాతి గుండె శకలంబై పోవునట్లుగా ||నా యన్న||పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ కరుణన్ దర్శింతు నేడు ||నా యన్న||ఇచ్చక మిది గాదు మిగుల దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన నా యవతారుడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నే జొచ్చి నీ ప్రేమ జూతు ||నా యన్న||తల వంచి సిగ్గున నే జేయు నేర ముల నెంతు నాలోన బలు మారు నీ గాయముల గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు పిలిపించి వేడుకొందు ||నా యన్న|| ✍ పురుషోత్తము చౌధరి Naa Yanna Raagadhe – Oa Yesu Thandri – Naa Anna Raagadhe = Naa Praana Dhanamaa – Naa Pattu Kommaa – Naa Mudhdhu Maata – Naa Mukthi Baata – Naa Anna Raagadhe = Naa Anna Siluvaloa Nee –Vaayaasa Padina Naati – Nee Yanghri Yugamu Nipudu – Naa Aasan Dheeran Chuuthu || Naa Yanna || Oka Thoata Loapata – Naadu Neevu Padina – Sakala Srama Lichchoata = Nikatamaiyunnatlugaa – Nitturpulathoa Thalanthu – Akata Naa Raathi Gunde – Sakalambai Poavunatlugaa || Naa Yanna || Paramaascharyamu Gaadhaa – Yeelaati Prema – Dharaniloa Nunnadhaa = Churukow Mullula Poatlaku Nee – Siramu Naa Vanti Neechapu – Purugu Korakandhichchedu Nee – Karunan Dharsinthu Nzzedu || Naa Yanna || Eischaka Midhi Gaadhu – Migula Thalapoaya – Muschchata Theeradhu = Achchi Vachchina Naa – Avathaaruda Nee Prakka – Gruchchu Gaayamu Loapalane – Jochchi Nee Preman Chuuthun || Naa Yanna || Thalavanchi Sigguna – Ne Cheyu Nera – Mula Nenthu Naa Loana= Palumaaru Neegaayamula – Keliki Nin Srama Parachu Naa – Khala Dhoashamulakai Yipudu – Vilapinchi Vedu Kondhu || Naa Yanna || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి