మరణాన్ని ఓడించావు విజయాన్ని సాధించావు


మరణాన్ని ఓడించావు విజయాన్ని సాధించావు
నీకెవరూ సాటిరారు నీవంటివారే లేరు
అ.ప: యేసు నీవే మహిమగల రాజువు
1 అత్యంత బలశాలి తానని – తననెవరు ఎదురించలేరని
అనుకుంది మరణం ధైర్యంతో – కరిచింది మట్టి నీ విజయంతో
2 భయపెట్టి మానవ జాతిని – తన దాసులుగ చేసుకొని
నిలిచింది మరణం దర్పంతో – కలిగింది స్వేచ్చ నీ విజయంతో
3 నరకమే జీవితపు చివరని – దాన్నుండి తప్పించేదెవరని
పలికింది మరణం గర్వంతో – దొరికింది జీవం నీ విజయంతో